Amavasya Gadiya : తెల్లవారితే అమావాస్య గడియ ముంచుకు వస్తోంది. మళ్లీ మంచి ముహూర్తం ఉందొ లేదో తెలియదు. జూలై నాలుగున చతుర్దశి ముహుర్థం ప్రారంభమై మరుసటి రోజు అంటే జూలై 5 తేదీ తెల్లవారు జాము మూడు గంటల వరకు ఉంటుంది. జూలై 5 తేదీ ఉదయం మూడు గంటల నుంచి అమావాస్య గడియలు ప్రారంభం అవుతున్నాయి. అందుకే అమావాస్య గడియలను చూసుకొన్నారు. చలో సీఎం ఇంటికి బయలు దేరారు ఆ ఆరుగురు ఎమ్మెల్సీలు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత ఐదు రోజుల నుంచి ఢిల్లీ లో తీరిక లేకుండా ఉన్నారు. పార్టీ భాద్యతలు, మంత్రివర్గ విస్తరణ అంశాలపై పార్టీ పెద్దలతో పాటు రాష్ట్ర అవసరాలరీత్యా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి బయలు దేరారు. సరిగ్గా గురువారం రాత్రి 11.30 గంటలకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు కొందరు ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నారు. సీఎం రాక ఆలస్య మైనప్పటికీ కూడా ఆయన ఇంటివద్దనే వేచి ఉన్నారు. అర్థరాత్రి 12 గంటల తరువాత సీఎం రేవంత్ రెడ్డి రావడంతోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆరుగురు ఎమ్మెల్సీలు. ఎందుకు అర్థరాత్రి వరకు సీఎం కోసం వేచి ఉన్నారంటే తెల్లవారితే అమావాస్య గడియ మొదలవుతుంది. అందుకనే అంత రాత్రి అయినా సీఎం కోసం వేచి ఉన్నారు ఆ ఆరుగురు.
తాజగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్సీ లతో కలిపి శాసన మండలిలో కాంగ్రెస్ బలం 12 కు చేరింది. మండలిలో మొత్తం సంఖ్య 40. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నవి. వాస్తవానికి కాంగ్రెస్ బలం నాలుగు మాత్రమే.తాజాగా చేరిన వారితో కలిపి 12కు చేరింది. ఇప్పుడు మండలిలో బీజేపీ కి ఒకరు. ఎంఐఎం కు ఒక ఎమ్మెల్సీ ఉండగా, ఇద్దరు ఇండిపెండెన్స్ ఉన్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నవి.