Hero Dhanush : తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో లు ఎందరో ఉన్నారు. ప్రత్యేక స్థానంతో అభిమానులను సంపాదించుకున్నారు. అభిమాన హీరో సినిమా వస్తోందంటే అభిమానులకు పెద్ద పండుగ. ఆ సినిమా విజయవంతం అయినా పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుకుంటారు. అవార్డులు వచ్చినా పండుగే అవుతుంది. ఇప్పుడు ఉన్న తమిళ స్టార్ హీరోలల్లో ధనుష్ ఒకరు. ఆయన కేవలం నటుడిగానే అభిమానులను మెప్పించడంలేదు.
ధనుష్ గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాత, రచయిత గా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతనికి అభిమానుల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ ఏడాది సంక్రాంతి పండుగ రోజు విడుదల అయిన ” కెప్టెన్ మిల్లర్ ” సినిమా అత్యధికంగా వసూళ్లు చేసింది. మొదట సినిమా నుంచి అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ రాలేదు. కానీ ఆ తరువాత మాత్రం వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి పెట్టడం విశేషం.
ఇది కూడా చదవండి: రూ. 8 వేలకే ఇంటిలో సినిమా ధియేటర్
స్టార్ హీరో ధనుష్ నటించిన సినిమా ఒక గొప్ప అరుదయిన రికార్డు సృష్టించి అభిమానులకు పండుగ వాతావరణం సృష్టించింది. 2024 సంక్రాంతి రోజు విడుదల అయిన ‘కెప్టెన్ మిల్లర్’ అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డ్స్‌లో నామినేట్ అయ్యిందని ఆ సినిమా చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేసింది. లండన్‌లో మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో అవార్డును అందజేయనున్నారు.
అంతర్జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిందని సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ ప్రకటించింది. ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం నామినేట్ అయినట్లు సినిమా సాంకేతిక బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో ధనుష్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. తమ అభిమాన నాయకుడి సినిమా అంతర్జాతీయ స్థాయి అవార్డు కు ఎంపిక కావడంతో అభిమానుల సంబరాల్లో మునిగిపోయారు.