Janasena mejarity : వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగారు. కానీ అయన అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. గడిచిన ఏడాదిన్నర నుంచి అటు బీజేపీ తో ఇటు తెలుగు దేశం తో పొత్తు పెట్టుకోడానికి మంతనాలకు తెరలేపారు. ఎట్టకేలకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఏమైనాయి. కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీచేశాయి. ప్రచారంలోకి స్వయంగ ప్రధాన మంత్రి మోదీనే రంగంలోకి దింపాయి టీడీపీ, జనసేన.
రెండు ఎంపీ సీట్లు జనసేనకే …. పొత్తులతో రంగంలోకి దిగిన జనసేన పార్టీ రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. మచిలీపట్నం, కాకినాడ ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న ఇద్దరు కూడా విజయం సాధిస్తారనే ధీమాలో పార్టీ అధినేత ఉన్నారు. మచిలీపట్నం స్థానం దాదాపుగా జనసేన అభ్యర్థికే అనుకూలంగా ఉందని పార్టీ వర్గాలు అంచనాకు వచ్చాయి. అదేవిదంగా కాకినాడ స్థానం కూడా గెలుపు ఖాయమనే ధీమాలో పార్టీ ఉంది. రెండు స్థానాల్లో దాదాపుగా అన్ని సామజిక వర్గాలు జనసేన అభ్యర్థులకు మద్దతు ప్రకటించాయి. వాటితోపాటు టీడీపీ, బీజేపీ పార్టీలు సంపూర్నంగ స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించాయి. యువత పెద్ద ఎత్తున తరలివచ్చి జనసేనకు మద్దతు ప్రకటించాయి.. పార్లమెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైసీపీ నేతలు కొందరు ఇబ్బందులకు గురిచేసినా జనసేన నేతలు తట్టుకొని అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయడం విశేషం. పోలింగ్ పూర్తయిన తరువాత మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ముఖ్య అనుచరుల వద్ద సంతోషంగా గడిపినట్టు సమాచారం.
పొత్తుల నేపథ్యంలో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. 21 స్థానాలకు గాను 18 స్థానాల్లో తన అభ్యర్థులు విజయం సాధిస్తున్నట్టు జనసేన సర్వే లో తేలింది. 2019 కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తున్న నేపథ్యంలో జనసేన నాయకులతోపాటు, కార్యకర్తల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. పొత్తులు కలిసిరావడంతో జనసేనకు అదృష్టం కలిసొచ్చింది. జనసేన అభ్యర్థుల విజయం కాయం కావడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఫలితాలు రావడమే మిగిలింది. ఫలితాల రోజున భారీ సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.