Vishnu : శ్రీ మహావిష్ణు మూర్తి ఎప్పుడు కూడా సాగరంలోనే పయనిస్తాడు అని తెలుసు. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తాడు. కానీ విష్ణు మూర్తికి ఏ చెట్టు ఇష్టమో చాలా మంది భక్తులకు తెలియదు. కొందరికి తెలిసి ఉండవచ్చు. ఆ చెట్టు పేరు ఏమిటి. ఆ చెట్టు కాయల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ మహా విష్ణు మూర్తికి అత్యంత ఇష్టమైన చెట్టు బదరీ వృక్షం (రేగు పళ్ళ చెట్టు ). కాబట్టి విష్ణు మూర్తి బదరికా వనంలో విహరిస్తాడని పురాణంలో చెప్పబడింది. అందుకనే బోగి పండుగ రోజు చిన్న పిల్లల తలపై బోగి పళ్ళను (రేగు పళ్ళు) పోస్తారు.
రేగు పళ్లతో పాటు నాణేలను కూడా కలిపి చిన్న పిల్లల తలపై పోయడంతో లక్ష్మీ దేవి అనుగ్రహం చేకూరుతుందని వేదంలో చెప్పబడింది. ఆ విదంగా పోయడం వలన శ్రీ మహా విష్ణు మూర్తి ఆశీర్వాదం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.