Home » Tirumala : తిరుమలలో ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణం

Tirumala : తిరుమలలో ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణం

Tirumala : తిరుమల ఆర్టీసీ బస్సులలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉచితంగా ప్రయాణించడానికి ఆర్టీసీ సంస్థ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. తిరుమల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వెళుతారు.

తిరుమల కొండలపైకి చేరుకున్న తరువాత భక్తులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళుతారు. అలా వెళ్ళడానికి ప్రైవేట్ వాహనాల్లో అధిక మొత్తం చెల్లిస్తున్నారు. ఇది భక్తులకు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉచితంగా ఆర్టీసీ బస్సులను ప్రవేశ పెట్టింది.

ఇప్పటికే టిటిడి ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం ఉంది. తాజాగా ఆర్టీసీ సంస్థతో ఒప్పందం చేసుకున్న బస్సులు ప్రతి స్టేజి వద్ద మూడు నుంచి నాలుగు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండనుంది. దేవస్థానం ఉచిత బస్సు తిరిగే బస్సు రూటు లల్లోనే ఆర్టీసీ ఉచిత బస్సులు కూడా నడుస్తాయని టిటిడి బోర్డు ఈఓ వెంకయ్య చౌదరి ప్రకటించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *