Money Plant : హిందువులు తమ కుటుంబం సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలని కోరుకుంటూ మొక్కలను, చెట్లను పూజిస్తారు. దాదాపుగా ప్రతి ఇంటిలో తులసి మొక్కకు నిత్యం పూజలు చేస్తారు. అదేవిదంగా రావి చెట్టుకు, ఉసిరి చెట్టుకు కూడా పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తితో ఉపవాసం ఉండి తమ మొక్కులు తీర్చుకుంటారు. అంటే మొక్కలు, చెట్లలో కూడా దేవతలు ఉంటారనేది హిందువుల నమ్మకం.
అదేవిదంగా హిందువులకు అత్యంత నమ్మకమైన మొక్కలల్లో మనీ ప్లాంట్ కూడా ఒకటి. దీన్ని ఇళ్లల్లో పెంచుకోటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ దీనికి ఎలాంటి పూజలు చేయరు. కేవలం డబ్బు సమస్య పరిస్కారం కోసమే కొందరు నమ్మకంతో పెంచుకుంటారు. ఈ మొక్కను పెంచుకోవడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, తద్వారా కుటుంబ సభ్యులు అందరు సుఖ సంతోషాలతో గడుపుతారని నమ్మకం. కానీ ఈ మొక్కను ఎక్కడ పడితే అక్కడ ఇంటి ఆవరణలో పెట్టరాదని శాస్త్రం చెబుతోంది. పలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెబుతోంది వేదం. అప్పుడే ఆ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి.
ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ పెట్టుకోవాలని కోరిక ఉన్నవారు ఇంటికి ఆగ్నేయ దిశలో నాటుకోవడం మంచిదని శాస్త్రం చెబుతోంది. ఈ విదంగా నాటుకోవడం వలన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. దాంతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా ఏమైనా సమస్యలు ఉంటె తొలగిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిశలో పెట్టరాదు. ఆలా చేయడం వలన ఆ కుటుంబం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.