Employment : ఎలాంటి ప్రవేశ పరీక్ష లేదు. కనీసం ఇంటర్వ్యూ కూడా లేదు. కేవలం పదోతరగతి పాస్ అయితే చాలు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ వచ్చింది. పదో తరగతి లో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటించింది.
ఎంపిక అయిన నాటి నుంచే పర్మినెంట్ ఉద్యోగం. ఎంపిక అయిన వారికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ డిపార్ట్మెంట్ లో పర్మినెంట్ ఉద్యోగం. 44,228 ఖాళీలు ఉన్నవి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ఆగష్టు 5 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఉద్యోగం పొందిన వారికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ గా నియామకం అవుతారు. ప్రారంభం నుంచే పర్మినెంట్ జాబ్, మంచి వేతనం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉండే అన్ని అలవెన్స్ లు కూడా పొందుతారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. పడో తరగతిలో సాధించిన మార్కుల అధారంగా ఎంపిక చేస్తారు. www.indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లోనే దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి. ఎంపిక అయిన వారి సెల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది.