Home » పద్ధతులు మార్చుకొని…పనిచేయండి

పద్ధతులు మార్చుకొని…పనిచేయండి

xr:d:DAGBRDuLR64:128,j:2204936970346144691,t:24041514

హైదరాబాద్ విడిచి వెళ్ళండి
అభ్యర్థులను గెలిపించండి
కోల్ బెల్ట్ ప్రతినిది:
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామనే ధీమాలో ఉండకండి.బిఆర్ఎస్ బలహీన పడింది. బీజేపీ బలోపేతమవుతోంది.కాబట్టి మనకు బిజెపి మధ్యనే ప్రధాన పోటీ ఉంటది.ప్రధాన పార్టీ బిజెపి ని తక్కువగా అంచనా వేసుకొని,మొన్న మనమే గెలిచాం,యిపుడు కూడా మనదే విజయం అంటూ కళలుకంటూ హైదరాబాద్ లోనే ఉండకండి.కచ్చితంగా 14 లేదా 15 స్థానాల్లో గెలువబోతున్నాం.కాబట్టి పద్దతులను మార్చుకొని పార్లమెంట్ అభ్యర్థుల విజయం కోసం పనిచేయండంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు,సీనియర్ నాయకులకు గీతోపదేశం చేశారని పార్టీ శ్రేణుల సమాచారం.పార్లమెంట్ అభ్యర్థుల విజయావకాశాలపై కేసి వేణుగోపాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగ ఆయన మాట్లాడిన మాటలు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ విదంగా ఉన్నాయి.పార్టీలో బీజేపీ,బిఆర్ఎస్ నాయకులు చేరడానికి ముందుకు వస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారు.అదేవిదంగా పార్టీని విడిచివెళ్లిన వారు కుడా చేరడానికి ముందుకు వచ్చేవారిని రానీయడంలేదు.ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కొందరు క్షణికావేశంలో పార్టీని వదిలి వెళ్ళినవారు ఉన్నారు.టికెట్ వచ్చిన వ్యక్తి పై అసంతృప్తితో వెళ్ళినవారు సైతం ఉన్నారు. ఇలాంటివారు రావడానికి ముందుకు వస్తే అడ్డుకోవడం సరికాదు.ఒకవేళ అటువంటివారు ముందుకు రాకుంటే మీరే ప్రోత్సహించి పార్టీలో చేరేవిదంగా కృషిచేయాలి.పార్టీ బలోపేతం కావాలంటే చేరికలు తప్పనిసరి.కాబట్టి చేరడానికి ఆసక్తి ఉన్న నాయకులను అడ్డుకోకండి అంటూ సుతిమెత్తగా హెచ్చరించినట్టు సమాచారం. అదేవిదంగా కొందరు ఒంటెద్దు పోకడతో పోతున్నారు.గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు.నియోజకవర్గంలో అందరిని కలుపుకొని వెళ్ళాలి. లేదంటే భవిష్యత్తులో మీ నియోజకవర్గాల్లో కష్టాల్లో పడిపోతారు.మంత్రులు,ఎమ్మెల్యేలు ఎవరు కూడా హైదరాబాద్ లో ఉండరాదు. అందరు కూడా హైదరాబాద్ విడిచి వెళ్ళండి. మీ,మీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషిచేయండి.మెజారీ పెంచడానికి కలిసి,మెలిసి పనిచేయండి అంటూ
పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ సున్నితంగా చెప్పినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *