2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
కుంభం రాశి
ధనిష్ట 3,4 పాదాలు శతభిషం పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం 14, వ్యయం 14,
రాజపూజ్యం 6 ,అవమానం 1
విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు విధినిర్వహాణలో నిర్లక్ష్యం పనికిరాదు. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. పిల్లల విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఏళ్ల నాటి శని ఈ రాశి వారికి ఉంది. ఏడాదిలో ఒకసారైనా ఇష్టదేవతల దర్శనం చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు తొందర పనికిరాదు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు చేసే ముందు జాగ్రత్ వహించాలి. ఇతరులకు అప్పు ఇవ్వడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఈ రాశి వారు ఇచ్చిన అప్పు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. అప్పు ఇవ్వడం మానుకోవాలి. వాటితో గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘంగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవడం చాల మంచిది.