2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
కన్య రాశి
ఉత్తర 2,3,4 పాదాలు హస్త,చిత్త 1,2 పాదాలు
ఆదాయం 5,వ్యయం 5
రాజపూజ్యం 5,అవమానం 2
శని,గురు గ్రహాలు అనుకూలించడం వలన కన్య రాశి వారికీ యాబై శాతం పైబడి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. మే నుంచి గృహ,ధన లాభం ఉంది. మే వరకు మధ్యంతరంగా ఉన్నప్పటికినీ ఆ తరువాత ఫలితాలు బాగుంటాయి. పంటల దిగుబడి బాగుంటది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆనందం,సుఖం,ప్రశాంతత పొందుతారు. శని క్షేత్రంలో ఆరోస్థానంలో ఉండటంతో ఈ రాశివారు అదృష్టవంతులు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పదవీయోగం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ రాశి ఉద్యోగులు జాగ్రత్తలు పాటించాలి.తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. చేసే పనిలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.లేనిచో ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులు అధికారులతో చనువుగా ఉండరాదు.