NIMS Jobs: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ నిజాం ఇన్ డిగ్రీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) సీనియర్ రెసిడెంట్ పోస్టుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నట్టు నిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. జూన్ 26 , 2024 తేదీ లోగ అర్హులైన వారు ఈ పోస్టుకు ధరఖాస్తు చేసుకోవాలని కోరింది.
ఖాళీగా ఉన్న విభాగాలు….
క్రిటికల్ కేర్, గైనకాలజీ, మెడికల్ ఇమ్యునాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జెనెటిక్స్, హేమటాలజీ, న్యూరాలజీ, రేడియేషన్, అంకాలజీ, మైక్రోబయాలజీ, జనరల్ మెడిసిన్, పాథాలజీ, రేడియాలజీ, ఇమేజియాలజీ, అనస్థీషియాలజీ డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్నాయి. సంబంధిత స్పెషాలిటీలో MD/MS/DNB ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. వేతనం నెలకు అన్ని అలవెన్సులు కలిపి రూ.1,21,641. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫారం ఖరీదు రూ: 500 గా నిర్ణయించారు. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ఫారంలను డీన్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ చిరునామాకు సకాలంలో పంపించాలి. జూన్ 26 తరువాత చేరిన దరఖాస్తులను తిరస్కరించబడుతాయని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.