Nabard Jobs : కేవలం ఒకే ఒక్క అర్హత . ఏదయినా డిగ్రీ ఉంటె సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీదే అవుతుంది. ఇంకా చెప్పాలంటే నియామకం అయిన నాటి నుంచి మీరు ఆ సంస్థలో పర్మినెంట్ ఉద్యోగులే అవుతారు. వేతనం కూడా మామూలుగ లేదు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచే ప్రతి నెల రూ : 89 వేలు పొందుతారు. వివరాలు ఇలా ఉన్నాయి.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రురల్ డెవలప్మెంట్ ( NABARD ) శాఖలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు nabard.org వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చును. 102 పోస్టులు ఖాళీగా ఉన్నవి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ఆగష్టు 15 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 1న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు 30 ఏళ్ల లోపు ఉండాలి. ఆన్ లైన్ లో నమోదయిన పరీక్ష ఫీజు చెల్లించాలి.
ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. అనంతరం ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి నేరుగా నియామకం సర్టిఫికెట్ అందజేస్తారు.