Bibipeta : బీబీపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో సోమవారం ఛత్రపతి శివాజి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మండలంలోని పలువురు అధికారులు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినంద నీయమన్నారు.
యువత సమాజ సేవ చేయడానికి ముందుకు రావాలన్నారు. కేవలం ప్రభుత్వం మీద ఆధారపడకుండా యువత సమాజ సేవ చేయడానికి ముందుకు రావడం సంతోషకరమైన విషయమన్నారు. యువత చేపట్టే ప్రజాసేవ కార్యక్రమాలకు మండలంలోని అధికారులు ఎల్లవేళలా సహాయ, సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు
ఈ కార్యక్రమంలో మండలంలోని ఎమ్మార్వో, ఎంపిడివో, ఎస్సై, మండలంలోని ఇతర అధికారులు, ఉద్యోగులు, గ్రామస్తులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.