2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
మేష రాశి:
అశ్విని,భరణి,కృతిక 1వ పాదం
ఆదాయం 8,వ్యయం 14
రోజపూజ్యం ,అవమానం 3
ధనలాభం శుభప్రదంగా ఉంది.75 శాతం పైబడి అదృష్ట యోగం ఉంది.పట్టింది బంగారమే అవుతుంది, విద్యార్థులకు, రైతులకు,వ్యాపారస్తులకు మంచి యోగం ఉంది.విద్యాయోగం బాగుంది.మే తర్వాత మంచి ఫలితాలు చేసే పనిలో కనబడుతాయి.వృత్తిలో రాణిస్తారు. ఉద్యోగంలో ఆలోచన విధానంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.పిల్లల అభివృద్ధి బాగుంటది.పిల్లలు విద్యార్ధి దశలో ప్రథమ స్థానంలో ఉంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబసభ్యులకు మేలు కలుగుతుంది. రైతులకు పంటదిగుబడి బాగుంటది. భూమి కొనుగోలు చేస్తారు. సంతాన యోగం ఉంది. శని యోగంతో ధనలాభం ఉంది. మార్చి 29 నుంచి ఈ రాశివారికి ఏలినాటి శని మొదలవుతుంది. శని ధాన్యం చేయడం మంచిది. విదేశీ యోగం చేసేవారికి కలిసివచ్చే అవకాశం కూడ ఉంది .