Rail Job : రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి రైల్వే శాఖ ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం ఖాళీలు 7,951. నియామకం అయిన నాటి నుంచి అన్ని అలవెన్సులు కలిపి 35,400 వేతనం వస్తుంది. జులై 30 నుంచి ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. ఆగష్టు 29 వరకు ధరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది. ఆసక్తి ఉన్నవారు తమ పరిధిలోని రైల్వే జోన్ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులన్నీ కూడా ఇంజనీరింగ్. 18 నుంచి 36 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ధరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది.
ఇంజనీర్ ఉద్యోగ నియామకాల్లో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్), మెటలర్జికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్) విభాగాలకు చెందిన పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 7,951 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే బోర్డు.
టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రైల్వే జోన్ ఆధారంగా RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ లో ధరఖాస్తు చేయాలి. ఆన్లైన్ లో నమోదయిన ఆధారంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.