Making Roti : సినీ నటీ, నటులు భోజనం ఖర్చు ఎంత అవుతుంది అంటే చెప్పలేము. వారి వంట గదిలో ఏర్పాట్లు చూడాలంటేనే రెండు కళ్ళు చాలవు. అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటారు. సామాన్య మానవుడి ఇల్లు ఎంత ఉంటదో, అంత విశాలంగా నటీ, నటుల వంటగదులు ఉంటాయనే ప్రచారం ఉంది. ఖచ్చితంగా వంట గదిలో గ్యాస్ పొయ్యి మీదనే ప్రతి ఒక్కరు వంట చేసుకుంటారు. చివరకు రొట్టెలు కూడా గ్యాస్ పొయ్యి మీదనే కాల్చు కుంటారు. కానీ ఒక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ తాను తినే రొట్టెలను కట్టెల పొయ్యిపై కాల్చుకొని మాత్రమే తినడం విశేషం. ఆమె ఎవరు. ఎందుకు ఆలా కట్టెల పొయ్యి పై కాల్చిన రొట్టెలను ఎందుకు ఇష్టపడుతోంది. ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.
2008 లో మొదటిసారి తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది శ్రద్దాదాస్. అల్లరి నరేశ్ తో జోడిగా సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం నటించింది. ఆ సినిమాతోనే గ్లామరస్ హీరోయిన్ గా పేరు తో పాటు, అభిమానులను సైతం సంపాదించుకొంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించి నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా నిలదొక్కుకోడానికి తోటి హీరోయిన్ లతో తట్టుకోలేక పోయింది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హింది సినిమాల్లో నటించినప్పటికీ శ్రద్ధాదాస్ వెనుకబడి పోయింది.
ఇటీవల ఈ అందాల భామ శ్రద్దాదాస్ మహారాష్ట్రలో పర్యటించింది. ఆ రాష్ట్రంలోని ఒక పల్లెటూరికి వెళ్ళినప్పుడు ఒక పూరి గుడిసెలోకి అకస్మాత్తుగా వెళ్ళింది. ఆ ఇంటి యజమానురాలు అప్పుడే కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేస్తున్న దృశ్యం శ్రద్దా దాస్ కంటపడింది. వెంటనే తాను కూడా ఆ ఇంటి మహిళతో కలిసి రొట్టెలు చేసింది. అంతే కాదు పొయ్యి పై పేనం పెట్టి రొట్టెలు కూడా కాల్చడం మొదలు పెట్టింది. కట్టెల పొయ్యి ద్వారా వచ్చే పొగను కూడా లెక్క చేయకుండా ఆమెతో కలిసి రొట్టెలు చేసింది. అదే ఇంటిలో వేడి, వేడిగా రొట్టెలు కూడా తిని ఆకలి తీర్చుకొంది. శ్రద్దా దాస్ రొట్టెలు చేయడం, కాల్చడంకు సంభందించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.