LIC Jobs : కేంద్ర ప్రభుత్వం పరిధిలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) లో పర్మినెంట్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఏదయినా డిగ్రీ అర్హత ఉంటె సరిపోతుంది. 200 ఉద్యోగాలను నియామకం చేయనున్నారు. ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. కీలకమైన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు కనీసం 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు వయసు ఉండాలి. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి డిగ్రీ కోర్సు కు సమానమైన ఏదయినా డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీలో తప్పనిసరిగా అరవై శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. కంప్యూటర్ ఆపరేటింగ్ తెలిసి ఉండాలి. LIC HFL అధికారిక పోర్టల్ www.lichousing.com ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే వారు ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి. ఆగష్టు 14 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో చేపడుతారు. మొదటి దశ ఆన్ లైన్ రాత పరీక్ష. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రెండో దశ ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ చాటిన వారిని ఎంపిక చేసి నియామకం పత్రాన్ని అందజేస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణిస్తారు.
ఆన్‌లైన్ లో నిర్వహించే పరీక్ష రెండు గంటలు. ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ మాదిరిలో ఉంటుంది. పరీక్షలో మొత్తంగా ఐదు సెక్షన్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ స్కిల్ తో ఉన్న ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. మైనస్ మార్కులు కూడా ఉంటాయి. ఒక తప్పు సమాధానాన్ని 0.25 మార్క్ కట్ చేస్తారు.