CPM : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఆదివాసీ గూడేల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి మండంలోని దేవాపూర్, గట్రావుపల్లి, రేగులగుడా, జెండా గూడ, సాలే గూడ, సొనపూర్,వెంకటాపూర్, లక్ష్మి పూర్, కుర్రే ఘాట్ గూడేలల్లో పర్యటించారు. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ….
గత కొన్ని రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఆదివాసీ గూడేలు బురదమయం అయ్యాయన్నారు. తద్వారా ఆదివాసీలు పలు ప్రాంతాల్లో అనారోగ్యంతో మంచం పట్టారని తెలిపారు. వారికి రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గూడేలన్నీ బురదమయం కావడంతో ఇంటి నుంచి కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. వారికి కనీసం వంట సరుకులు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదన్నారు. కాబట్టి ఆదివాసీ గూడేల్లో వైద్య శిభిరం ఏర్పాటు చేయడంతో పాటు కనీసం నెలకు సరిపడు సరుకులు ఉచితంగా అందజేయాలని సంకె రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయనతో పాటు సిపిఎం నాయకులు పాయిరాల రాములు తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు , ఆదివాసీలు పాల్గొన్నారు.

by