IFTU : ఎందరో ప్రాణత్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న ప్రజాస్వామిక హక్కులను హరించడానికే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువస్తోందని ఐఎఫ్ టియు జాతీయ ఉపాధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. కేసముద్రం మండల కేంద్రంలో IFTU తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. యూనియన్ పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల అమరులైన ఐ ఎఫ్ టీ యు జాతీయ నాయకులు కామ్రేడ్ రాజ్ సింగ్ మహబూబాబాద్ జిల్లా కోశాధికారి లక్ష్మయ్య తో పాటు తదితర నాయకులకు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన శిక్షణ కు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ…..

దేశంలో 50 కోట్ల మంది కార్మిక వర్గంలో కేవలం ఆరు నుంచి ఏడు శాతంగా ఉన్న సంఘటిత కార్మికులకు మాత్రమే వర్తించే కొద్దిపాటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తోందని ఆరోపించారు. నాలుగు లేబర్ కోర్స్ తేవడం ద్వారా కార్మికుల సంక్షేమం, ఉపాధి, ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడిందని ఆయన ఆరోపించారు. అన్నం పెట్టే రైతు, వ్యవసాయ కార్మికుల, రైతు కూలీల ఉపాధి భద్రత తో పాటు రైతులకు భూమిపై హక్కు లేకుండా మోడీ ప్రభుత్వం చట్టాలను అమలు చేయడానికి తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో IFTU ఇండియా ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, AIKMS సహాయ కార్యదర్శి గౌని ఐలయ్య తదితరులు ప్రసంగించారు. శిక్షణ తరగతులకు ముఖ్య ఆహ్వానితులుగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, రాష్ట్ర నాయకులు బండారి ఐలయ్య, నందగిరి వెంకటేశ్వర్లు హాజరుకాగా, ఈ నరేష్, హెచ్ లింగయ్య, ఎస్ శ్రీధర్, ఏపూరి వీరభద్రం, కోటేష్, అరుణ, అనురాధ, ఈ నరేష్, ఐ రాజేశం, బ్రహ్మానందం, శ్రీనివాస్, గుండేటి మల్లేశం, ఎడ్ల రవికుమార్.తదితరులు పాల్గొన్నారు.

by