Home » 20 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నరు….

20 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నరు….

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నాతో సంప్రదింపులు జరుపుతున్నారు అంటూ మాజీ సీఎం,బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం తెలంగాణ భవన్ లో సంచలన వ్యాఖ్యలు చేసారు.బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతోపాటు పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏ సందర్బంగ ఆయన మాట్లాడుతో సంచలన వ్యాఖ్యలు చేశారు.17 మంది లోకసభ అభ్యర్థులతోపాటు కంటోన్మెంట్ అభ్యర్థి కూడా బి ఫారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన మంత్రి మోదీ పై పలు ఆరోపణలు చేస్తూ విరుచుకుపడ్డారు.ఏడాది తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడుతుందన్నారు. అదేవిదంగా లిక్కర్ కేసులో బలం లేదని, కేవలం మనపై కక్ష తీర్చుకోడానికి లిక్కర్ కేసును తయారుచేసి కవితను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుంది…..
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని కేసీఆర్ జోస్యం చెప్పారు.ఏడాది తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడిపోవడం ఖాయమన్నారు.మనకు 111 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం బలంగా ఉన్నపుడే మోదీ మన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రపన్నాడని గుర్తుచేశారు.ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడినంత మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టకుండా ఎలా ఉంటాడని కేసీఆర్ ప్రశ్నించారు.ఎన్నికల అనంతరం మోదీ గద్దె ఎక్కిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు వెంటనే మొదలవుతాయంటూ కామెంట్ చేసారు.
లిక్కర్ కేసు పచ్చి అబద్దం:
కేవలం మోదీ నాపై కక్ష పెట్టుకొని లిక్కర్ కేసును తయారుచేసి కవితను జైలు కు పంపాడని కేసిఆర్ ఆరోపించారు.లిక్కర్ కేసు పచ్చి అబద్దమని,అందులో పసలేదని, కేవలం కావల్సుకోని కక్ష తో తప్పుడు కేసు పెట్టి కవితను జైలుకు పంపడం జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నాయకుడు బిల్ సంతోష్ ను అరెస్ట్ చేయడానికి మన ప్రభుత్వం పోలీసులను పంపడం జరిగిందని వివరించారు. అప్పటి నుంచి ఆ విషయాన్ని మోదీ మనసులో పెట్టుకొని కక్ష కట్టడం జరిగిందన్నారు.
22 నుంచి కార్నర్ మీటింగ్లు,రోడ్ షోలు ….
ఈ నెల 22 నుంచి పార్లమెంట్ కు పోటీచేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం  చేయనున్నామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రచారంలో భాగంగా రోడ్ షోలు,కార్నర్ మీటింగ్ లు,నిర్వహిస్తామన్నారు.వరంగల్,మహబూబ్ నగర్,ఖమ్మం నియోజకవర్గాల్లో భారీ ఎత్తున బహిరంగ సభలను నిర్వహిస్తామన్నారు. ప్రతి లోకసభ నియోజకవర్గం పరిధిలోని రెండు,మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు కూడా ఉంటాయని ప్రకటించారు.ప్రతిరోజూ రెండు నుంచి మూడు రోడ్ షో లు ఉండేవిదంగా ప్రణాళిక ఉంటుందన్నారు. అదేవిదంగా ఈ నెల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బసు యాత్ర కూడా చేపడుతామన్నారు. ప్రచారంలో ఎక్కడైనా అవసరము అనుకుంటే తాను జిల్లా కేంద్రాల్లో ఉండటానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు.ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి ఎక్కడైనా అవసరము అనుకుంటే భారీ బహిరంగ సభలు కూడ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *