jr NTR : జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మంచి ఊపు మీద ఉన్నారు. ఆ సినిమా పై అయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నెల 27 న విడుదల చేస్తున్న సందర్బంగ అభిమానులు ఉత్సహంతో ఉన్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటి స్వర్గీయ శ్రీదేవి కూతురు జాహ్నవి నటించింది.
ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితమయ్యారు. ఇప్పుడు అయన తన పరిధిని పెంచుకోడానికి ఉత్సాహంగా ఉన్నారు. దేవర సినిమాకు సంబంధించిన విషయాలను ఒక మీడియాతో పంచుకున్నారు. ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తన మనసులోని కోరికను బయట పెట్టారు. ప్రముఖ తమిళ చిత్ర నిర్మాత వెట్రిమారన్ తో కలిసి పనిచేయాలనే కోరిక ఉందని తన మనసులో దాగి ఉన్న విషయాన్నీ చెప్పేశారు.
తెలుగు మాట్లాడే ప్రజలు తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉన్నారు. అక్కడ కూడా ఆయనకు తెలుగు, తమిళ భాష మాట్లాడే అభిమానులు సైతం ఉన్నారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ తమిళంలో నటించాలనే కోరికను వెల్లడించినట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు విన్న అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన వారు సైతం ఆనందం వ్యక్తం చేసారు.