BJP : తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధక్షుడిగా ఎన్ రామచంద్ర రావు నియామకం వెనుక ఢిల్లీ పెద్దలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు ఈ పదవి ఎన్నో సవాళ్లతో నిర్మితమై ఉంది. రాష్ట్ర భాద్యతలు చేపట్టడానికి గతంలో మాదిరిగా పార్టీ పరిస్థితి రాష్ట్రంలో లేదు. గతానికంటే బిన్నంగా ఉంది. ఒకవైపు రాబోయే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలి. మరోవైపు నాయకులను సమన్వయం చేసుకుంటూ పోవాలి.
పార్టీ తరపున ఒక రాజ్య సభ సభ్యుడు, ఎనిమిది మంది ఎంపీ లు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీ లు ఉన్నారు. వీరితో పాటు పార్టీ కేంద్ర కమిటీ స్థాయి నాయకులు, రాష్ట్ర కమిటీలో చోటు సంపాదించుకునే వారిని సమన్వయం చేసుకుంటూ తన మార్క్ ఏమిటో ఢిల్లీ పెద్దలకు చూపించుకోవాలి. అంతే కాదు జాతీయ కమిటీ ఆశయాలకు తగ్గట్టుగా భాద్యతలు నిర్వర్తించాలి. ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా కొత్త అధ్యక్షుడు మెదులు కోవడం అంట సులభం కాదు. అధికార పార్టీ తో పాటు బిఆర్ఎస్ ను కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి.
రాబోయేది అంత కూడా రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరమే. ఎనిమిది మంది ఎంపీ లు ఉన్నారంటే రాష్ట్రంలో 56 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ బలంగా ఉన్నట్టు రాజకీయ గణాంకాలు చెబుతున్నాయి. ఈ 56 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించే విదంగా కృషి చేయాల్సిన భాద్యత కూడా అధ్యక్షుడు రామచంద్రరావు పైననే ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారం దక్కకపోయినా ఇప్పుడున్న మెజార్టీని రెట్టింపు చేసినా జాతీయ కమిటీ సంతోషిస్తుంది.
పొలిటికల్ బ్యూరో,
కొమ్మెర అనిల్ కుమార్, ఎమ్మే, బీఎడ్.