RS Praveen Kumar : అఖిల భారత సర్వీస్ ఉద్యోగానికి ఎంపిక కావాలంటే ఎన్ని పుస్తకాలు చదవులో ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో కళారంగానికి సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి. మనం చదివే పుస్తకాలల్లో ఇది ఆంధ్ర, ఇది గుజరాత్, ఇది కాశ్మిర్ అంశాలకు చెందినది అంటూ ఇది చదవాలి, ఇది చదవకూడదు అంటే అఖిల భారత సర్వీస్ ఉద్యోగానికి ఎంపిక కాలేము. అటువంటి ప్రాంతీయ బేధం లేకుండా పట్టుపట్టి పుస్తకాలు చదివి ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపికయిన మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు సినీ సంగీత కళాకారుల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్విట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంగీతానికి ఒక ప్రాంతం, హద్దు అనేది ఉంటుందా ?. సంగీతాన్ని వినిపించే సాధకుడికి ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంటుంది. కానీ సంగీతానికి ప్రాంతాలు, హద్దులు ఉండవు. RRR సినిమా లోని నాటు నాటు పాటకు ఏ అవార్డు వచ్చిందో మాజీ పోలీస్ బాస్ కు తెలియదా ?. రెహమాన్ సంగీతం ప్రపంచ స్థాయిలో మోగింది మీకు తెలియదా ?. తెలంగాణ సంగీత దర్శకుడు చెక్రి టాలీవుడ్ లో సంచనాలు సృష్టించింది తెలియదా ? ఇవన్నీ తెలిసిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ దేశ చరిత్ర చదివి కూడా ఇలా మాట్లాడటం విడ్డురంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గడిచిన పదేళ్లలో మీ అధినేత కేసీఆర్ చేసిన పనులపై కూడా మీరు మాట్లాడాలి. యాదాద్రి రూప శిల్పి ఎవరు ?. దానికి సంబందించిన రాయి ఎక్కడి నుంచి తెచ్చారు ?. అప్పుడప్పుడు చైనా జీయర్ స్వామి సలహాలు మీ నాయకుడు కేసీఆర్ తీసుకున్నాడు. ఆయన ఎక్కడి వ్యక్తి ?. తెలంగాణలో ప్రాజెక్ట్ లు కట్టింది మేఘ రెడ్డి. అయన ఎక్కడి కాంట్రాక్టర్ ?. క్రీడా కారులైన గోపి చాంద్, చాముండేశ్వరి ఎక్కడి వారు ?. జై బోలో తెలంగాణ సినిమాలో నటించిన జగపతి బాబు ఎక్కడి కథా నాయకుడు ?. వీటన్నిటిని చూస్తుంటే తెలంగాణకు అవమానం జరిగినట్టు మీకు అనిపిస్తలేదా అని పలువురు సంగీత ప్రముఖులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు.