Congress : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బిఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైనది. అధికారం పోవడంతో గులాబీ ఎమ్మెల్యేలు కొందరు కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకా కొందరు కాంగ్రెస్ లో చేరడానికి సమయం, సందర్భం, ముహూర్తం కోసం వేచిచుస్తున్నారు. గులాబీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి తరలి వస్తున్న నేసథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరపడ్డారు.
సంబర పడుతున్న కాంగ్రెస్ నాయకులకు ఊహించని షాక్ తగిలింది. ఇటీవలనే గులాబీ జెండా వదిలి కాంగ్రెస్ జెండా ఎత్తుకున్న ఒక ఎమ్మెల్యే తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు అయన మాట్లాడుటూ పుట్టింటికి వాచినట్టు ఉందని, కన్న తల్లి దగ్గరకు చేరుకున్నట్టు ఉందని సంబరపడుతున్నారు. ఇంతకు ఆ ఎమ్మెలే ఎవరంటే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొని నెల రోజులుకూడా కాలేదు. అప్పుడే అయన మెట్టునిల్లు వదిలిపెట్టి తిరిగి పుట్టినిల్లు చేరుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీలోసరైన ప్రాధాన్యత లేకే ఆయన కాంగ్రెస్ ను వీడారా..? లేదంటే మరేదైనా కారనం ఉందా ..? అనే చర్చ రాజకీయ శ్రేణుల్లో జరుగుతోంది.