Home » BJP : మీడియాతో మీరు మాట్లాడకండి

BJP : మీడియాతో మీరు మాట్లాడకండి

BJP : మీడియాతో మాట్లాడటానికి తెలంగాణ కాషాయం శ్రేణులకు ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆంక్షలు విధించినట్టుగ పార్టీ వర్గాల సమాచారం. ఒక్కో నాయకుడు ఒక్కో విదంగా మాట్లాడేసరికి పార్టీ ఇరుకున పడిపోతోంది. ప్రత్యర్థులకు ఆయుధాలు ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి సమయం, సందర్భం వచ్చినప్పుడు మెమే చెబుతాం. అప్పుడే మీడియాతో మీరు మాట్లాడుదురు. అప్పటి వరకు నోటికి తాళం వేయండి అంటూ ఢిల్లీ నుంచి మాట వచ్చినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ మాటతో పాటు రాష్ట్ర అధ్యకుడు కూడా అదే విదంగా సూచన చేసినట్టుగా సమాచారం.

బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణాలు ఏమిటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ భాద్యులు మీడియా వద్ద మాట్లాడుతున్నారు. ఎవరికి వారే, యమునా తీరే అనే మాదిరిగా మాట్లాడేసరికి ఢిల్లీ పెద్దలు ఇరుకున పడిపోతున్నారు. రాష్ట్రంలో జరిగిన మాటలకు ఢిల్లీలో సంజాయిషీ ఇచ్చుకునే పరిష్టితి కూడా అప్పుడప్పుడు ఎదురవుతోంది. పార్టీ నేతల్లో కొందరు ఒకవిదంగా, మరికొందరు ఇంకో విదంగా మాట్లాడే సరికి పార్టీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మీడియా తో మాట్లాడరాదంటూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాలు ఇఛ్చినట్టుగా పార్టీ వర్గాల సమాచారం.

మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మేఘ కంపెనీ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన తరువాత బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మేఘా సంస్థ చేస్తున్న తప్పులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేఘా సంస్థ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు దక్కించుకొంది. మహేశ్వర్ మాటలతో కాషాయం శ్రేణులు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హైడ్రా విషయంలో కొందరు పొగుడుతున్నారు. మరికొందరు విమర్శిస్తున్నారు. ఎంపీ రఘునందన్ రావ్ మాట్లాడిన మాటలు పూర్తిగా భిన్నంగానే వినబడుతున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలకు పొంతన కుదరడంలేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలతోపాటు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా మీడియా సమావేశాలపై ఆంక్షలు విధించినట్టుగా పార్టీలో ప్రచారం సాగుతోంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *