Home » YS Jagan X Sharmila : ఇండియా కూటమివైపు జగన్ చూస్తే…షర్మిల పయణం ఎటువైపు ?

YS Jagan X Sharmila : ఇండియా కూటమివైపు జగన్ చూస్తే…షర్మిల పయణం ఎటువైపు ?

YS Jagan X Sharmila : తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిలకు ముందు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే తలపడింది. ఆ ఎన్నికల్లో కూటమి విజయం సాధించగా , మిగతా రెండు పార్టీలు పరాజయం పాలయ్యాయి. ఏపీ లో రాజకీయ పరిస్థితులు ఊహించని స్థితిలో ఉన్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నాయి. ఐదేళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా ఉన్న జగన్ ఇప్పుడు ఒంటరివాడయ్యాడు.

గడిచిన ఐదేళ్లలో జగన్ కాషాయం నీడలోనే అలసట తీర్చుకున్నాడనే అభిప్రాయాలూ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ నీడలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొనసాగుతున్నారు. తనకు ఇప్పుడు మరో నీడ అవసరం. ఇండియా కూటమి నీడ వైపు వెళుదామంటే ఇప్పటికే అక్కడ సోదరి షర్మిల ఉన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఇటీవలి ఎన్నికల్లో జగన్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది. ఇండియా కూటమిలో షర్మిల ఉండగా తనకు చోటు దక్కుతుందా అనే అనుమానం కూడా జగన్ మదిలో వచ్చింది.

ఇండియా కూటమి ఒకవేళ ఒప్పుకుంటే షర్మిల ఒప్పుకునే విషయం కూడా అనుమానమే. ఎందుకంటే కుటుంబ పరంగా ఏర్పడిన అంతర్గత సమస్యలతో పాటు, బాబాయ్ హత్య విషయాల్లో షర్మిల తన అన్నపై కోపంగానే ఉన్నారు. హత్య సంఘటనపై ఎన్నికల ప్రచారంలో షర్మిల తీవ్రంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో కూటమితో జగన్ జతకడితే షర్మిల కూడా జతకట్టుడు అనుమానమేననే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతీయపార్టీల మద్దతు తప్పనిసరి. ఇప్పిటికిప్పుడు జగన్ కాంగ్రెస్ నీడన చేరినా ఇండియా కూటమికి పెద్దగా ఒరిగేది కూడా ఏమిలేదు. జగన్ ఢిల్లీలో తాజాగా ధర్నా చేపట్టారు. అక్కడ కొన్ని పార్టీలు మద్దతు కూడా తెలిపాయి. మద్దతు తెలిపిన పార్టీలో కొన్ని ఇండియా కూటమిలో కొనసాగుతున్నాయి.

ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ తోపాటు జగన్ కు కూడా బీజేపీ, శివసేన, టీడీపీ పార్టీలు బద్ద శత్రువులు. రాబోయే ఎన్నికల్లో ఈ కూటమిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతయినా జగన్ మద్దతు అవసరమే. కాబట్టి జగన్ ను కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకుంటే షర్మిల కాంగ్రెస్ లో కొనసాగడం అనుమానమేనని అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇన్ని రోజులు జగన్ ను విమర్శించిన షర్మిల అప్పుడు ప్రజలకు ఏమని సమాధానం చెబుతుంది. అదేవిదంగా కుటుంబానికి కూడా ఏమని చెబుతుందనే ప్రశ్నలు ఏపీ రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి.

ఒకవేళ జగన్ కాంగ్రెసుతో జతకడితే, ఖచ్చితంగా షర్మిల బయటకు వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం కాషాయం కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు రాజకీయ శ్రేణులు. ఎందుకంటే కాకలుతీరిన రాజకీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలతో ఢిల్లీ స్థాయిలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. పక్కా కాంగ్రెస్ వాది. అటువంటి నాయకుడే ఖద్దరు వదిలేసి, కాషాయం కండువా కప్పుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం షర్మిల కాషాయం కండువా ఎందుకు కప్పుకోదనే ప్రశ్నలు కూడా ఏపీలో తలెత్తుతున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *