Olympics 2024 : 13 ఏళ్ల తరువాత భారత దేశపు క్రీడాకారులు సంబరాల్లో మునిగిపోయారు. గడిచిన 13 ఏళ్లలో ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్ లో ఇండియాకు ఏ ఒక్క పథకం రాలేదు. తాజా ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్ లో మను బాకర్ పాల్గొని కాంస్య పతకాన్ని సాధించింది.
షూటింగ్ ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా చరిత్రకెక్కడం విశేషం. పారిస్ ఒలింపిక్స్‌లో 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మను బాకర్ పాల్గొని కాంస్య పథకాన్ని సాధించడంతో ఇండియాలో క్రీడాకారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమె కాంస్య పథకం సాధించడంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను బాకర్ 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పాల్గొంది. కాంస్య పతకం సాధించి సరికొత్త రికార్డును మను బాకర్ తన రికార్డ్ లో నమోదు చేసుకొంది. ఒలింపిక్స్, 2024 షూటింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించి చరిత్రలో నిలిచి పోయింది.
ఫైనల్ పోటీల్లో మను బాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతకాన్ని ముద్దాడింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మను బాకర్ పతకం సాధించడంతో మను బాకర్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిదంగా మను బాకర్ సాధించిన ఘన విజయం పట్ల ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు, తోటి క్రీడాకారులు అభినందనలతో ముంచెత్తారు.