Singareni : CPM తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలను జనవరి 25 నుంచి 28 వరకు నిర్వహించ నున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి తెలిపారు. అయన మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత పార్టీ రాష్ట్ర స్థాయి మహాసభలను సంగారెడ్డి లో నిర్వహిస్తున్నామని తెలిపారు.
మహాసభను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే మహాసభలో పలు తీర్మానాలు చేయనున్నామన్నారు. దేశంలో కార్మిక, నిరుద్యోగ, రైతాంగ వ్యవస్థలపై పలు తీర్మానాలు చేయనున్నామన్నారు. అనంతరం నూతన రాష్ట్ర కమిటీ ఎంపిక కూడా ఉంటుందన్నారు. సభ ముగింపు రోజున సంగారెడ్డి పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు. ఈ ప్రదర్శనలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా సంకే రవి ఈ సందర్బంగా కోరారు.
ఈ కార్యక్రమంలో బోడెంకి చందు, దుంపల రంజిత్ కుమార్, దూలం శ్రీనివాస్, బోండ్ల సరిత, కాసిపేట రాజేశం, సత్తిష్ తో పాటు మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు తదితరులతో కలిసి సంకే రవి మహాసభల పోస్టర్లను విడుదల చేశారు.