CPI : బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణికి సంబంధించిన భూములను కాపాడాల్సిందిగా కోరుతూ సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పలువురు సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ……. బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ వెనకాల గల సౌత్ కాస్కట్ గని కి సంబంధించిన భూమి కబ్జా కు గురవుతున్నదని, వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. పట్టణం లోని బజార్ ఏరియాలో సౌత్ కలాస్కట్ బొగ్గు గని ఎంతో మంది కార్మికులకు ఉపాదినిచ్చింది.
ఈ గని కి అనుకొని క్యాంటీన్, ఎస్ఎంపిసి ఆఫీస్, కోల్ శాంపిల్ ఆఫీస్, సివిల్ డిపార్ట్మెంట్, లాంప్ క్యాబిన్ కార్యాలయం ఉండేవి. కన్యకా పరమేశ్వరి దేవాలయం, పద్మశాలి ఫంక్షన్ హాల్ స్థలంలో సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టు క్యాజువల్ వర్కర్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసే ఆఫీసు, మినీ సిమెంట్ పరిశ్రమ ఉండేది. వీటికి అనుకొని ఉన్న కొంత స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని సీపీఐ నాయకులు ఆరోపించారు.
ఉత్పత్తి ఉత్పాదకత అవసరాల రీత్యా ఏర్పాటు చేసిన ఎక్స్ప్లోరేషన్ డివిజన్ ఆఫీసు, ఏజెంట్ ఆఫీసు, వర్క్ షాప్, పవరోజ్ ఓల్డ్ సి ఎస్ పి, మమ్మద్ హుస్సేన్ షెడ్ టింబర్ యాడు, ఓల్డ్ జిఎం ఆఫీస్, టింబర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లను సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ భూములతో పాటు పద్మశాలి భవన్ ముందు నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని సీపీఐ నాయకులు సింగరేణి జీఎం ను కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట స్వామి, ఏఐటిసి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ , బ్రాంచ్ సహాయ కార్యదర్శి తిరుపతి గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, బెల్లంపల్లి పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజం, పట్టణ కోశాధికారి మంతన రమేష్, నాయకులు రత్నం ఐలన్న తదితరులు పాల్గొన్నారు

by