singareni : 2023-2024 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బొగ్గుగని కార్మికులు సాధించిన లాభాల వాటాల్లో కొన్ని కార్మిక సంఘాలు అసత్యపు ప్రచారాన్ని చేస్తున్నాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. కార్మికులకు లాభాల వాటా చెల్లింపులో అన్యాయం జరిగితే తమ సంఘం సహించేది లేదన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాడిన సంఘంగా ఏఐటీయూసీ కి సింగరేణిలో ఒక చరిత్ర ఉందన్నారు.
లాభాల వాటా చెల్లించే విధానంలో ఎలా లెక్కిస్తారో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్న సంఘాలకు తెలియకపోతే ఎలా అని అయన ప్రశ్నించారు. కొన్ని కార్మిక సంఘాలు తమ ఉనికిని కాపాడుకోడానికి అసత్యపు ప్రచారం చేస్తున్నాయని, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని కార్మికులు తిప్పికొట్టాలని సీతారామయ్య కోరారు. కార్మికులకు గడిచిన సంవత్సరం లో చెల్లించే 33 శాతం వాటా కు ఎలా లెక్కిస్తారో అనే గణాంకాలను సీతారామయ్య ఈ విదంగా వివరించారు.
కార్మికుల హాజరు పై 85 శాతం చెల్లిస్తారు. ఈ 85 శాతం తో 679 కోట్ల రూపాయలు చెల్లించే విదంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రూప్ పర్ఫామెన్స్ ఆధారంగా 14 శాతం తో 111 కోట్ల 45 లక్షల రూపాయలు చెల్లించనున్నారు. అదేవిదంగా ఒక శాతం ఇన్సెంటివ్ తో ఐదు కోట్ల రూపాయలు చెల్లించనున్నారు.
వీటితో పాటు అండర్ గ్రౌండ్ కార్మికులకు రోజుకు రూ : 771.11 చెల్లిస్తారు. ఉపరితలం లో పనిచేసే వారికీ రోజుకు రూ : 610 46. డిపార్ట్మెంట్ లో పనిచేసే కార్మికులకు రూ : 563.50. చెల్లిస్తారు. ఈ విదంగా లెక్కించిన లాభాల వాటాను ఈ నెల ఏడో తేదీన యాజమాన్యం కార్మికులకు బ్యాంకు ఎకౌంట్ ద్వారా చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నదని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.