Home » TBGKS : కొప్పుల ఈశ్వర్ కు టీబీజీకేఎస్ పగ్గాలు ఎందుకంటే ?

TBGKS : కొప్పుల ఈశ్వర్ కు టీబీజీకేఎస్ పగ్గాలు ఎందుకంటే ?

TBGKS : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. గులాబీ పార్టీకి అనుబందంగా సింగరేణిలో పనిచేస్తోంది. ఉద్యమం నేపథ్యంలోనే సింగరేణిలో సంఘం పురుడు పోసుకుంది. రెండుసార్లు కార్మిక గుర్తింపు సంఘంగా పనిచేసింది. ఓటమిని ముందే పసిగట్టిన సంఘం ఇటీవల జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. సింగరేణి గుర్తింపు హోదాలో సంఘం కొంత మోదం, మరి కొంత ఖేదం మూటగట్టుకుంది.

పీకల్లోతు కష్టాల్లోకి కూరుకు పోయిన సంఘాన్ని ఎంత బలోపేతం చేద్దామన్నా కుదిరే పరిస్థితి లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కార్మికులు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను దూరం పెట్టారు. సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పుడు కుటుంబంకు దూరమైనది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొప్పులు ఈశ్వర్ కు యూనియన్ పగ్గాలు అప్ప జెబుతూ ఆమెను సంఘం నుంచి పొమ్మన లేక పొగపెట్టారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

కొత్తగా భాద్యతలు చేపట్టిన మాజీ మంత్రి ప్రస్తుత పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట స్వగ్రామం. గోదావరిఖని సీఎస్పీ -1 లో సింగరేణి కార్మికుడిగా నియామకం. ఆ తరువాత మేడిపల్లి ఓపెన్ కాస్ట్ లో విధులు నిర్వహించారు. 1994 లో టీడీపీ లో చేరిక. ఆ అనంతరం 2001 లో తెలంగాణ ఉద్యమం. ఆ తరువాత ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రిగా భాద్యతలు.

సింగరేణిలో కార్మికుడిగా 26 సంవత్సరాల అనుభవం ఉంది. కార్మిక సమస్యలు, సంస్థ పై అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో కేటీఆర్ భాద్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు అధికార పార్టీని, మరోవైపు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ని ఎదుర్కొంటూ సంఘాన్ని ఏ మేరకు బలోపేతం చేస్తారో వేచిచూడాల్సిందే. పార్టీకి ఒకే ఒక్క ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. ఎంపీ లు లేరు. బలగం లేని సింగరేణిలో సంఘాన్ని గట్టెకించడం కష్టసాధ్యమే అంటున్నారు కార్మిక వర్గం.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *