Singareni : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి వర్క్ షాప్ లో నెలకొన్న అపరిష్కృత సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముష్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా కోరారు. గురువారం వారు ఏరియా వర్క్ షాప్ ను సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ …..
ఏరియా వర్క్ షాప్ లో పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించాలన్నారు. అదే విదంగా విశ్రాంతి గదులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అదనంగా మరొక సైకిల్ షేడ్ నిర్మించాలని, మిషన్ షాప్, ఫాబ్రికేషన్ షెడ్, మౌల్డింగ్ షెడ్లు కు మరమ్మతులు చేయించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏరియా వర్క్ షాప్ లో అనారోగ్యంతో బాధపడే జనరల్ మజ్దూర్ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారి స్థానంలో యువకులను ఏర్పాటుచేయాలన్నారు. అనంతరం టెక్నీషియన్స్ మరియు ఉద్యోగస్తులు తెలియజేసిన పలు సమస్యలను డీజీఎం దృష్టికి తీసుకువెళ్లి చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరు కొమురయ్య, జిఎం కమిటీ చర్చల ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి, బద్రి బుచ్చయ్య, గొల్లపల్లి రామచందర్, మైనింగ్ స్టాప్ నాయకులు అడ్డు శ్రీనివాస్ , ట్రేడ్స్ మెన్స్ నాయకులు సురేష్, ఫిట్ కార్యదర్శి సదానందం, రాఘవ రాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.