Bibipeta : బీబీపేట మండల కేంద్రలో నూతన తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది వేడుకలను భారీ ఎత్తున నిర్వహించనున్నామని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింలు గురువారం తెలిపారు. మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద ముదిరాజ్ సంఘం పతాకావిష్కరణ చేసి ఉగాది వేడుకలను ప్రారంభించనున్నామని తెలిపారు.
అనంతరం ఉగాది పచ్చడిని పెద్దమ్మ ఆలయంలో పంపిణీ చేయనున్నామన్నారు. వేదపండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో బీబీపేట మండల వాసులతో పాటు, పరిసర గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కామారెడ్డి జిల్లా ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి నర్సింలు కోరారు.