CPI : బెల్లంపల్లి మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన మండల ప్రజలకు సకాలంలో కులం, నివాసం, ఆదాయం సర్టిఫికెట్లు అందడంలేదని సీపీఐ బెల్లంపల్లి పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్ ఆరోపించారు. గురువారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ సాంకేతిక కారణాల వలన రెవెన్యూ కార్యాలయంలో 2300 పైగా దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో దరఖాస్తు దారులు మండల కార్యాలయం చుట్టూ తిరుగుతూ అవస్థలపాలవుతున్నారని ఆయన ఆరోపించారు. దరఖాస్తుదారులకు సమాధానం కూడా సరిగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని రాజేష్ ఈ సందర్బంగ కోరారు.