Singareni : బొగ్గు గనుల వేలం పాటను రద్దుచేసి సింగరేణి సంస్థకే బ్లాక్ లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు ప్రజలతో సంతకాల సేకరణ చేసి సింగరేణికి అనుకూలంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీపీఎం నాయకులు మాట్లాడుతూ
మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు పరిశ్రమను కార్పొరేటర్ సంస్థలకు ఇవ్వడం కోసమే బొగ్గు బ్లాక్ ల వేలం పాటను నిర్వహించడానికి ముందుకు వచ్చిందని వారు ఆరోపించారు. బొగ్గు గనులు ప్రభుత్వం చేతిలో ఉంటేనే ప్రజలకు ఉపాధి లభిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం కూడా ఉంటుందన్నారు.
కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం ఉచిత కరెంటును ఎత్తివేయడానికే కుట్ర పన్నుతోందని వారు ఆరోపించారు. ప్రజలందరికీ నష్టం చేసే విధంగా మోడీ ప్రభుత్వం బొగ్గు బావులను ఆదాని,అంబానిలకు కట్టబెట్టడం కోసమే వేలంపాటను నిర్వహించడం జరిగిందని ఆరోపించారు. వేలంపాట ఉత్తర్వులను రద్దుచేసి,సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాక్లను కేటాయించాలని సిపిఎం నాయకులు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఏరియా బోడెంకి చందు, జిల్లా మండల, పట్టణ స్థాయి నాయకులు దాసరి రాజేశ్వరి, సమ్మక్క, నాగ జ్యోతి, రేణుక,సత్యం, B.శ్రీనివాస్, బొందయ్య, బూదక్క, B.సరిత, B.రమాదేవి, K.మధుకర్ తదితరులు పాల్గొన్నారు