Home » Singareni : సింగరేణి రిటైడ్ కార్మికులను పట్టించుకోని గుర్తింపు సంఘం

Singareni : సింగరేణి రిటైడ్ కార్మికులను పట్టించుకోని గుర్తింపు సంఘం

Singareni : సింగరేణి బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తూ దీపావళి పండుగకు ముందు పదవీ విరమణ పొందిన కార్మికులకు సింగరేణి యాజమాన్యం దీపావళి బోనస్, లాభాల వాటా పంపిణీ చేయలేదని, అటువంటి కార్మికులందరిని గుర్తించి వెంటనే దీపావళి బోనస్ తోపాటు లాభాల వాటా ఇవ్వాలని కోరుతూ తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గాని కార్మిక సంఘం(ఐ ఎఫ్ టీ యు) నాయకులు సింగరేణి డైరెక్టర్ (ఫా) వెంకటేశ్వర రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఐ ఎఫ్ టీ యు గౌరవ అధ్యక్షులు టి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్ లు మాట్లాడుతూ సర్వీసులో ఉన్న కార్మికులందరికీ యాజమాన్యం దీపావళి బోనస్, లాభాల వాటా మంజూరు చేసి, కేవలం పండుగకు ముందు పదవీ విరమణ పొందిన కార్మికులకు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల ముందు విధుల నుంచి తప్పుకున్నవారిని పక్కకు పెట్టడం సరికాదన్నారు. సంస్థ ఆర్థికాభివృద్ధిలో వారు కూడా భాగస్వాములేననే విషయాన్నీ సింగరేణి యాజమాన్యం గ్రహించాలని కోరారు.

కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం కార్మిక గుర్తింపు సంఘంతోపాటు, ప్రతినిధ్య సంఘం కూడా దీపావళి బోనస్ తోపాటు లాభాలవాట పొందని కార్మికుల గురించి పట్టించుకోకపోవడంపై ఐఎఫ్ టీయూ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పదవి విరమణ పొందిన కార్మికులకు లాభాల వాటాతోపాటు దీపావళి బోనస్ ను వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని, సంబంధిత తేదీని ప్రకటించి రిటైర్డ్ కార్మికులందరికీ న్యాయం చేయాలని సింగరేణి యాజమాన్యాన్నివారు కోరారు.ఈ సందర్బంగా డైరెక్టర్ (పా) వెంకటేశ్వర రెడ్డి స్పందించి త్వరలోనే పదవీ విరమణ పొందిన కార్మికులందరికీ బోనస్, లాభాల వాటా చెల్లించే తేదీని ప్రకటిస్తామని హామీ సైతం ఇవ్వడం జరిగిందని ఐఎఫ్ టీయూ నాయకులు తెలిపారు.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *