Home » Singareni : సులబ్ కార్మికులకు లాభాల వాటా ఇవ్వాలి.

Singareni : సులబ్ కార్మికులకు లాభాల వాటా ఇవ్వాలి.

Singareni : సింగరేణి బొగ్గుగనుల ప్రాంతాల్లో యాజమాన్యం ఏర్పాటు చేసిన సులభ్ కాంప్లెక్స్ లవద్ద విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా యాజమాన్యం 2023-2024 ఆర్థిక సంవత్సరం లాభాల వాటాను వెంటనే ఇవ్వాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్.(ఐ ఎఫ్ టీ యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి అశోక్. లు సింగరేణి యజమాన్యంను డిమాండ్ చేసారు. రామగుండం రీజియన్ లోని ఆర్ జి -1 జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం పర్సనల్ మేనేజర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కార్మికులు సాధించిన లాభాల్లో వాటా గా ఐదువేల రూపాయలు ఇవ్వడం అభినందనీయమన్నారు. అదేవిదంగా సులభ్ కాంప్లెక్స్ లవద్ద పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల వాటా ఇవ్వకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేసారు. సంస్థ ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ లవద్ద పనిచేస్తున్న వారికి ఇవ్వకపోవడం సరికాదన్నారు. గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి కూడా యాజమాన్యం వెంటనే లాభాల వాటా ఐదువేల రూపాయలు ఇవ్వాలని వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, సులబ్ కార్మికులు కోట వెంకన్న, ఈ భానయ్య,జీ నవీన్,డీ మల్లేశ్వరి,సంతోష్ కుమార్,డీ సమ్మయ్య, ఏ దుర్గ, మిరియాల సరోజన, టీ దామోదర్, మధునయ్య తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *