three members : ప్రజా ప్రతినిధుల మద్దతు పుష్కలంగా ఉంది. ఇంకేముంది చట్టాన్ని దుర్వినియోగం చేశారు. న్యాయాన్ని తుంగలో తొక్కారు. స్థాయి చూడలేదు. నిబంధనలు పక్కకుపెట్టి బంధించారు. అధికారంలో ఉన్న పార్టీ మద్దతు ఎప్పటికి ఉంటుందని కళలు కన్నారు. ఆ కళలు పగటి కలలే అయినాయి. నమ్ముకున్న అధికారం పోయింది. అధికారంలో ఉన్న పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఇంకేముంది సస్పెండ్ కాక తప్పలేదు. ప్రభుత్వం ఇంటికి పంపింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబై హీరోయిన్ జెత్వానీపై తప్పుడు కేసులు ఏపీ లో నమోదయినాయి. అప్పటి వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ సంఘటన జరిగింది. మహిళా అని చూడకుండా హింసించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. కేసుకు సంబంధించి అన్ని వివరాలను కూటమి ప్రభుత్వం సేకరించింది.
కూటమి ప్రభుతం భాద్యులైన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై విచారణకు ఆదేశించింది. విచారణకు సంబందించిన నివేదిక మూడు రోజుల కిందటనే ప్రభుత్వానికి చేరింది. సీఎం చంద్రబాబు నాయడు నివేదిక పై సంతకం చేయడంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారుల్లో అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు, విజయవాడ కమిషనర్ గా పని చేసిన కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీలు ఉన్నారు.