Home » Telangana : తెలంగాణలో విగ్రహాల రాజకీయం

Telangana : తెలంగాణలో విగ్రహాల రాజకీయం

Telangana : తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ఈ ఏర్పాట్లపై బిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కొన్ని మార్పులు సవరించింది. రిజిస్ట్రేషన్ విభాగంలో సవరణలు చేపట్టి టీఎస్ ను టిజి గా చేసింది. తెలంగాణ గేయాన్ని సవరించి అధికారికంగా గుర్తించింది.

ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసింది. సచివాలయం ఎదుట ప్రతిష్టాపన కూడా జరిగింది. తాజాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని గులాబీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 33 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తే రూ : 5.77 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. సోనియా గాంధీ పుట్టిన రోజు పురస్కరించుకొని డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది.

తెలంగాణాలో మొదట బిఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఏడాది కిందటి వరకు ఆ విగ్రహాలే అధికారిక కార్యక్రమాలు వేదికయినాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత విగ్రహాల నిర్మాణంలో పలు మార్పులు తీసుకువచ్చింది. ఇది ఇలా ఉండగా తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పాత విగ్రహాలను మారుస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం వద్ద పైసలు లేవంటూనే రాజకీయ పోటీ నేపథ్యంలో విగ్రహాల కోసం ఖర్చు చేయడం ఏమిటనే ప్రశ్నలు సైతం రాష్ట్రంలో తలెత్తుతున్నాయి.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *