కోల్ బెల్ట్ ప్రతినిది :
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏదేని ఒక ప్రాంతానికి బయలుదేరాదంటే వందల మందితో కూడిన పరిష్ఠమైన భద్రత ఉంటది. ఆ ప్రాంతాన్ని ముందస్తుగా తమ ఆధీనంలోకి సెక్యూరిటీ అధికారులు తీసుకుంటారు. బాంబు స్కాడ్ తనిఖీలు విస్తృతంగా చేపడుతుంది. అనుమానాస్పద వ్యక్తులను ముందుగానే తమ ఆధీనంలోకి తీసుకుంటారు.ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసన తెలుపాలని నిర్ణయించుకుంటే నిఘావర్గాలు ముందుగానే గుర్తిస్థాయి.వెంటనే స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పర్యటన అనంతరం వదిలిపెడుతారు.పర్యటన ఒక వేల రాత్రివేళ ఉంటె అక్కడ విద్యుత్ శాఖ అధికారులు మూడు రోజుల ముందుగానే సరఫరాలో అంతరాయం రాకుండ ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటారు.
సీఎం భద్రత ….
ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ , సీఎం సెక్యూరిటీ గ్రూప్,క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్, ఎస్కార్ట్, ఇన్నర్ కార్డన్,అవుటర్ కార్డన్,సరిహద్దుల భద్రత,రోప్ పార్టీ,స్టోన్ గార్డ్, స్పెషల్ బ్రాంచ్,నిఘా విభాగం,ఇలా వందల మందితో సీఎం ఉన్న చుట్టూరా భద్రత కొనసాగుతుంది. వీరందరితోపాటు అడుగడుగునా స్థానిక పోలీసులు భద్రత కల్పిస్తారు.వీరందరిని దాటుకొని ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ ను రాయితో కొట్టారంటే భద్రత పరంగా ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఘోరంగా వైఫల్యం చెందిందనే ఆరోపణలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.సీఎం వ్యక్తిగతంగా సానుభూతి కోసం చేయించుకున్నాడా,లేదంటే నిజంగానే అసంతృప్తితో ఎవరైనా చేసారా అనేది ఇక్కడ అవసరం లేదు.సంఘటన ఎలా జరిగింది, జనం మధ్యలో ఉండి గుర్తులేని వ్యక్తి రాయి విసురుతుంటే,జనం ఎందుకు పట్టుకోలేకపోయారనేది కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
విద్యుత్ సరఫరా ….
రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటె ఆ ఏరియాలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు.రాత్రివేళ పర్యటన ఉంటె ఆ ప్రాంతంలో విద్యుత్ కోతలు లేకుండా చూసుకుంటారు.సరఫరాలో అంతరాయం ఉండకుండా ఉండేందుకు మూడు రోజుల ముందే తనిఖీలు చేసి మరమ్మతులు చేస్తారు.ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఉన్నప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఎందుకు ఏర్పడింది అనేది కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది.విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగానే ఆయన వ్యక్తిగత సిబ్బంది వెంటనే సీఎం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి తీసుకెళ్లి జాగ్రత్తలు తీసుకోవాలి.కానీ ఆ సమయంలో సీఎంను బస్సు మీదనే ఉండటానికి సిఎంఎస్ జి ఎలా ఒప్పుకుంది అనేది కూడ ఆనుమానగానే ఉంది. ఒకవేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతది అనుకుంటే ఫోకస్ లైట్లను ముందుగానే ఏర్పాటు చేసి పెట్టుకోవాలి.ఇక్కడ కూడా భద్రత సిబ్బంది పర్యవేక్షంపై అనుమానాలు కలుగుతున్నాయనే అభిప్రాయాలను ప్రముఖుల భద్రతను పర్యవేక్షించిన పలువురు మాజీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-