కోల్ బెల్ట్ ప్రతినిధి:
తాతలు ఇచ్చిన ఆస్తి.ఎవరయినా ఎందుకు పోగొట్టుకుంటారు.ఎవరయినా ఆ ఆస్తిని కాజేయాలని ప్రయత్నిస్తే ఎవరు ఊరుకోరు.ఒకటి కాదు.రెండు కాదు. ఏకంగా ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కబ్జా చేస్తే ఎందుకు ఊరుకుంటారు.తన భూమిని కబ్జా చేశారని భూమి హక్కుదారుడు గమనించాడు.మర్యాదగా అడిగితే భూమి రాదని గమనించాడు.అయితే తన భూమి తనకు దక్కడానికి ఏమిచేసాడంటే…. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి…..
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి గ్రామానికి చెందిన ముస్కు రామయ్య కు వారసత్వముగా ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.తాత అష్టి కావడంతో తనపేరుమీద రెవెన్యూ రికార్డుల్లో ఎలా నమోదు చేయించుకోవాలో తెలియదు.ఈ నేపథ్యంలోనే ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తి రెవిన్యూ రికార్డుల్లో తన పేరుతో నమోదు చేయించుకున్నట్టుగా తెలిసింది. దింతో తనకు వారసత్వముగా వచ్చిన భూమి తనకు దక్కదనే బాధతో ఉన్నాడు.
తన భూమి తనకు దక్కాలంటే ఎలా అని ఆలోచిస్తున్న క్రమంలోనే ఇటుక బట్టీలల్లో పనిచేసే కూలీలతో స్నేహం కుదిరింది.వారిద్వారా తుపాకులు దొరికే పట్టణాలను తెలుసుకున్నాడు.పలు పట్టణాల్లో తరుగుతున్న క్రమంలోనే ఆగ్రాలో తుపాకులు అమ్ముతారని తెలిసి అక్కడ కొనుగోలు చేసాడు.
తుపాకీతో మల్లారెడ్డి,అతని కొడుకును కాల్చి చంపితే తన భూమి తనకు వస్తుందనే ఆలోచనతో కొనుగోలు చేసిన తుపాకీతో గ్రామానికి తిరిగివచ్చాడు. ఇటీవల తుపాకి కొన్న రామయ్య మల్లారెడ్డి పై కాల్పులు జరిపాడు. కాల్పుల నుంచి తప్పించుకున్న మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రామయ్యను కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న తుపాకీతోపాటు, నాలుగు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఈ సందర్బంగా కాల్వ శ్రీరాంపూర్ పోలీసులను అభినందించారు
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-
.