YSRCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మార్ఫింగ్ కథలు వెంటాడుతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద, పెద్ద నేతలు చేసిన చేష్టలపై అధికారంలో ఉన్న టీడీపీ ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. ఎవరేమనుకుంటే నాకేంటి. అధికారంలో ఉన్నాం. అంటూ ఆడింది ఆట, పాడింది పాట అయ్యింది వైసీపీ నేతల వ్యవహారం. ఏమాత్రం సంకోచించకుండా ఆ పని చేసింది నేను కాదు. ఆ వీడియో నాది కానే కాదు అంటూ మొత్తుకున్నారు. ఎవరో గిట్టని వారు నా ఫోటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేసారని మీడియా నే బోల్తా కొట్టించే అంత పని చేసి చేతులు దులుపుకున్నారు వైసీపీ నేతలు. ఆలా బరితెగించిన మాటలు ప్రజలను సైతం ముక్కున వేలేసుకునేలా చేశాయి. ఇప్పుడు ఆ మార్ఫింగ్ కథలపై టీడీపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ ఒక గదిలో గడిపిన వ్యవహారం సంచలమైనది. ఆ వీడియో చూసిన ఎవరైనా అందులో ఉన్నది గోరంట్ల మాధవ్ అని చెప్పక తప్పదు. అయినప్పటికీ ఆ వీడియోలో ఉన్నది నేను అసలే కాదు. విచారణకు నేను సిద్ధం. తానే స్వయంగా సీఐడీ విచారణకు ఆదేశించడం పెద్ద చర్చ అయ్యింది. ఆయన తరువాత మేమేమన్న తక్కువ తిన్నామా అంటూ అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ కూడా పదిమంది చెప్పుకునేంత పనులు చేసి గోరంట్ల మాధవ్ కంటే ఎక్కువ మార్కులే కొట్టేశారు.
వైసీపీ అధికారం అటకెక్కిన తరువాత విజయసాయి రెడ్డి విజయగాథ బయటకు పొక్కింది. ఇప్పుడు అనంత బాబు వ్యవహారం గురించి ఎపి ప్రజలు కథలు, కథలుగా చెప్పుకుంటున్నారు. నాయకులు ఎందరో తెలియదు. బాధితులు కూడా ఎందరో తెలియదు. ఎంత మంది ఇలాంటి వ్యవహారాలను కార్యకర్తలు తలదించుకునే విదంగా నడిపారో తెలియదు. కానీ ఇప్పుడు వారిని నమ్ముకున్న కార్యకర్తలు తల ఎత్తుకునే పరిస్థితి ఏ మాత్రం లేదని ప్రజలు అంటున్నారు. వైసీపీ నాయకులు చేసిన ఘనకార్యాలపై టీడీపీ ప్రభుత్వం దృష్టి సారించినట్టు మాత్రం ఏపీ ప్రజల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.