Home » Revanth Reddy : ఆ ముగ్గురు సీఎం ను ఎందుకు కలిశారు.

Revanth Reddy : ఆ ముగ్గురు సీఎం ను ఎందుకు కలిశారు.

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కండువాలు మార్చుకునే సంప్రదాయం మొదలువుతుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలోనే తాజా ఎన్నికల్లో ఓటమి చెందినవారు, గెలిచిన వారు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూనే ఉన్నారు. కొందరు కండువా మార్చుకున్నారు. మరికొందరేమో మా నియోజక వర్గం అభివృద్ధి కోసం కలిసి వినతి పత్రం ఇచ్చామంటున్నారు. కాంగ్రెస్ గూటిలో చేరిన వారు మా పుట్టింటికి వచ్చాం. ఇందులో తప్పేముంది అంటూ సమర్ధించుకున్నారు కొందరు. అయితే బీజీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని ఎప్పటినుంచో కాంగ్రెస్ ప్రధాన నాయకులు కొందరు చెబుతూనే ఉన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. గతంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు నిజమవుతున్నాయా, లేదంటే వారు వారి నియోజక వర్గం ప్రజల కోసం వచ్చారా అనేది కలిసిన వారే చెప్పాలని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసినవారిలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ ముగ్గురు సచివాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్టు ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఉన్నది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు. మిగతా ఐదుగురిని కలుపుకొని సీఎం వద్దకు ఎందుకు వెళ్లలేదనేది సమస్య. ఆ ఐదుగురికి వీలుకాలేదని కూడా చెప్పే అవకాశం కూడా ఉంది. ఒకవేళ సీఎం ను కలవడానికి వెళ్లే ముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి సమాచారం అందించారా అనే ప్రశ్నలు బీజేపీ శ్రేణులు నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఎనిమిది మంది ఎమ్మెల్యే లల్లో ఐదుగురు అందుబాటులో లేనప్పుడు సీఎంకు బహిరంగ లేఖ రాయవచ్చు కదా అనే ప్రశ్న తలెత్తింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో రేవంత్ రెడ్డి కి లేఖ పంపే అవకాశం కూడా ఉంది. ఆ అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేదని కూడా పలువురు రాజకీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు.

తాజాగా సీఎం ను కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జెండా మోసినవారే కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహేశ్వర్ రెడ్డి కాషాయం గూటికి చేరారు. రామారావు పటేల్ కూడ గతంలో కాంగ్రెస్ గూటిలో ఉన్నవారే. రాకేష్ రెడ్డి బీజేపీ లో చేరినప్పటికీ సీఎం తో ఆరోగ్యకరమైన వాతావరణంలోనే కొనసాగారు. రైతు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది. వచ్చేది వర్షాకాలం. ఈ కాలంలో అతివృష్టి ఏర్పడినా, అనావృష్టి ఏర్పడినా వినతి పత్రం ఇవ్వడానికి వెళితే సందర్భం సరిగా ఉండేది. సీఎం ఆగష్టు 15 లోపు రుణమాఫీ చేయడానికి సిద్దంగానే ఉన్నారు. రైతు బందు పంపిణి జరుగుతూనే ఉంది. వడ్ల కొనుగోలు సజావుగానే సాగుతోంది. ఎక్కడో ఒకచోట చిన్న, చిన్న సమస్య ఉంటె ఉండవచ్చు. అంత మాత్రాన ముగ్గురు కలిసి సీఎం ను కలిసి వినతి పత్రం ఇచ్చేంత సందర్భం మాత్రం కనబడుత లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *