కోల్ బెల్ట్ ప్రతినిధి
పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా 400 మంది అభ్యర్థులను గెలిపించుకొని ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్ళు ఊరుతోంది.కలిసి వచ్చిన పార్టీలతో పొత్తు పెట్టుకుంది.పొత్తులతో సంబంధం లేకుండానే ఒంటరిగానే 400 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది బీజేపీ. ఈ ఎన్నికలు బిజెపికి అత్యంత కీలకం.కాబట్టి దేశంలోని అన్ని స్థానాల్లో కీలక నేతలు పర్యటిస్తున్నారు.ఏ ఒక్క స్థానాన్ని వదలకుండా విస్తృత ప్రచారం చేస్తున్నారు.గెలుపే లక్ష్యంగా కేంద్ర మంత్రులు అహర్నిశలు ప్రత్యర్థులకు చిక్కకుండా ప్రచారం చేస్తున్నారు.ఒకవైపు మోదీ,మరోవైపు అమిత్ షా వెంట,వెంట పార్టీ విజయావకాశాలను పరిశీలిస్తూ ప్రచారంలో ఉన్న కేంద్ర మంత్రులకు సలహాలు,సూచనలు ఇస్తున్నారు.
మావోయిస్టు ఇలాకాలో ….
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ అక్కడ ప్రత్యక ఏర్పాట్లు చేసింది.మావోయిస్టు లకు సురక్షితమైన స్థావరం. అందులో బస్టర్ ఏరియా మరింత సురక్షితమైన ఏరియా దట్టమైన అడవులు. గిరిజన ప్రాంతం అధికం. పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది.అటువంటి ప్రాంతంలో మెజార్టీ స్థానాలు దక్కించుకోడానికి బీజేపీ కంకణం కట్టుకొంది.శనివారం కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ బస్టర్.కాంకేర్ లోకసభ పార్లమెంట్ స్థానాల్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీస్ శాఖ తోపాటు,కేంద్ర,పారామిలటరీ,బిఎసెఫ్ పోలీస్ బలగాలు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. ఆ రెండు నియోజక వర్గాల్లో రాజనాథ్ సింగ్ అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఉదయం పదిన్నర గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో బయలుదేరి జగదల్ పూర్ కు చేరుకుంటారు. అక్కడి దంతేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బస్టర్ పార్లమెంట్ పరిధిలోని దంతెవాడలో నిర్వహించే బార్పూర్ రోడ్ షో లో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడినుంచి బయలుదేరి కాంకేరి నియోజకవర్గం పరిధిలోని అగర్వాల్ స్టేడియంలో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.