Home » ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి

ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి

xr:d:DAGBRDuLR64:114,j:1351504612516809217,t:24041308

కోల్ బెల్ట్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఫలితాలు వెలువడ్డాయి.దీంతో తెలంగాణలో ఫలితాల కోసం విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతముగా ముగిసాయి.పరీక్ష సమయాల్లో ఎలాంటి ఇబ్బంది విద్యార్థులకు కలుగకుండా ముగియడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.ఇక ఫలితాల కోసం ఎదురు చూడక తప్పడంలేదు.ఫిబ్రవరి 28 నుంచి మర్చి 19 వరకు పరీక్షలు ముగిసాయి.రాష్ట్రంలో విద్యార్థుల సౌకర్యార్థం 1521 జూనియన్ కళాశాలల్లో పరీక్ష రాయడానికి ఏర్పాట్లు చేసారు బోర్డు అధికారులు. జవాబు పత్రాల వాళ్యేషన్ ను కేటాయించిన కేంద్రాల్లో గతనెల 10 తేదీన ప్రారంభించారు. సరిగ్గా నెల రోజుల్లో మూల్యాంకనం పూర్తయ్యింది.
ఒకేసారి ఫలితాలు ….
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలు వేరు వేరు తేదీల్లో ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించే ఆనవాయితీ ఉండేది.ఒకరి ఫలితాలు విడుదల చేసి,మరొకరివి ఆలస్యం చేయడంతో కొంతమేరకు విద్యార్థుల్లో ఆందోళన మొదలవుతుంది. సున్నిత మనస్తత్వం విద్యార్థులు కాబట్టి ఫలితాలను ఒకేసారి విడుదల చేసిన నేపథ్యంలో వారిలో మానసికంగా ఇబ్బందులు రావనే ఉద్దేశ్యంతో బోర్డు అధికారులు ఒకేరోజు ఫలితాలను ప్రకటించాడనికి అన్గాన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాంకేతిక పరంగా కూడ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 20,21,22 ఈ మూడు తేదీల్లో ఎదో ఒక రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్,సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేరోజు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు అధికారవర్గాల సమాచారం.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *