PM MODI : దేశ ప్రధాన మంత్రి మూడోసారి లోకసభకు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో దిగుతున్నారు. నామినేషన్ వేసిన మోదీ తన అఫిడవిట్ లో ఆస్తులను ప్రకటించారు. పోలీస్ కేసులను సైతం ప్రకటించారు. తనకు సొంత ఇల్లు లేదని, అదేవిదంగా ఇప్పటి వరకు కారు కూడా కొనుగోలు చేయలేదని తన అఫిడవిట్ లో వివరంగా తెలిపారు.
మొత్తం ఆస్థి విలువ మూడు కోట్ల రెండు లక్షలు ఉన్నట్టు వివరించారు. SBI లో ఫిక్స్ డ్ రూపంలో రెండు కోట్ల ఎనబయి ఆరు లక్షలు ఉన్నాయి. గాంధీ నగర్, వారణాసి లో ఉన్న బ్యాంకు అకౌంట్ లో ఎనబై వేల మూడు వందల నాలుగు రూపాయలు నిల్వ ఉన్నాయని మోదీ తన అఫిడవిట్ లో తెలిపారు. ప్రస్తుతానికి వ్యక్తిగతంగా నిల్వ రూపంలో యాభయ్ రెండు వేల తొమ్మిది వందల ఇరువై రూపాయలు నగదుగా ఉన్నాయి. వీటి తోపాటు రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల విలువ గల నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయని ప్రధాన మంత్రి మోదీ తన అఫిడవిట్ లో వివరంగా తెలిపారు.
2018-2019 లో ఉన్నటువంటి తన ఆదాయం 11.14 లక్షలు. ఆ ఆదాయం 2022-2023 నాటికి 23.56 లక్షల రూపాయలకు పెరిగిందని మోదీ ఆస్తుల వివరాల్లో తెలిపారు. NSS లో 9.12 లక్షలు పెట్టుబడి రూపంలో పెట్టుకున్నట్టు మోదీ తెలిపారు. 1978 లో BA ., 1983 లో MA చదివినట్టుగా మోదీ తెలిపారు. అదేవిదంగా ఎలాంటి పోలీస్ కేసులు కూడా తనపై నమోదు కాలేదని మోదీ తన అఫిడవిట్ లో వివరంగా తెలిపారు.