Bibipeta : తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి నిరంతరం కరెంట్ సరఫరా ఇవ్వాలని కామారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన బీబీపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ హామీలు ఉచిందని ఆయన ఈ సందర్బంగా ఆరోపించారు. అధిరంలోకి వచ్చిన తరువాత హామీలు నెరవేర్చకుండా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని ఆరోపించారు. రైతులకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయి, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని కూడా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ విషయంలోనే సాధ్యం కానీ హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిందనేది తెలిసి పోయిందన్నారు. పరిపాలన చేయడం చేతకాక, ప్రతిపక్షము పై బురద చల్లుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు.
మాజీ చైర్మన్ పరికి ప్రమ్ కుమార్ తో పాటు మండల బిఆర్ఎస్ మండల కార్యదర్శి దేవునిపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆది దుర్గయ్య, దొంతల శ్రీనివాస్, శేర్బీపెట్ గ్రామ యూత్ అధ్యక్షుడు కరికె సంతోష్, ఇతర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.