Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నెమ్మది, నెమ్మదిగా మాజీ సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకోబోతుందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మంగళ వారం కవిత బెయిల్ పిటిషన్ కోసం కోర్ట్ లో వాదనలు జరిగాయి. ఈ వాదనల్లో ED తన వాదనలు వినిపించింది. లిక్కర్ కేసుకు సంబందించిన ప్రతి విషయాన్నీ కవిత ముందుగానే కేసీఆర్ కు చెప్పిందని ఈడీ తన వాదనల్లో వినిపించింది. తన వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన తీసుకు రావడంతో బిఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యారు. కవిత ముందుగానే కేసీఆర్ కు చెప్పిన విషయాన్నీ గోపీకుమారన్ అనే నిందితుడు తన వాంగ్మూలంలో కూడా చెప్పాడని కోర్టుకు తెలిపింది ఈడీ. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ ను దించినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయినది.
కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వచ్చినపుడు కవిత లిక్కర్ స్కామ్ నిందితులను పరిచయం కూడా చేసిందని, అదేవిదంగా సమీర్ మహేందు అనే వ్యక్తి నుంచి కూడా కేసీఆర్ వివరాలను అడిగి తెలుసుకున్నారని ఈడీ తన వాదనల్లో కోర్ట్ కు తెలిపింది. నగదు ఎంత, ఆదాయం ఎంత వస్తుంది అనే విషయాలపై కూడా కేసీఆర్ అరా తీశారని ఈడీ తెలిపింది. కవిత మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంది. ఆమె ఉన్నత విద్యావంతురాలు. పలు పదవులను కూడా నిర్వహించింది అంటూ కోర్ట్ కు వివరించింది. వాదనలు విన్న కోర్ట్ తన తీర్పును రిజర్వులో ఉంచింది.
లిక్కర్ స్కామ్ కేసు బహిర్గతం అయినప్పటి నుంచి కేసీఆర్ పేరు వస్తుందని రాజకీయ నాయకులు బహుశా ఊహించలేదు. కేసీఆర్ కు తెలియకుండానే కవిత వ్యవహారం నడిపించిందనే అభిప్రాయాలు సైతం రాష్ట్రంలో ఉన్నాయి . గోపి కుమారన్ అనే నిందితుడు ఎప్పుడో తన వాంగ్మూలం ఈడీ కి ఇచ్చాడు. అప్పటి నుంచి నేటి వరకు ఎప్పుడు, ఎక్కడ ఏ సందర్భంలో కూడా కేసీఆర్ పేరు ను ఈడీ పలకపోవడంపై కూడా రాజకీయ శ్రేణులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కేసు విచారణ లో ఈడీ ఒక వ్యక్తి పేరును సమయం, సందర్భం లేకుండా ప్రస్తావించదు. కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు ఖచ్చితంగా ఈడీ దృష్టిలో ఉంటేనే కోర్ట్ ఎదుట పెట్టి ఉంటారనే చర్చ రాజకీయ శ్రేణుల్లో మొదలు కావడం విశేషం.