Soniya Gandhi : కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది. రాష్ట్రము ఏర్పడి పదేళ్లు పూర్తి అయ్యింది. వరుసగా రెండుసార్లు ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి గా కొనసాగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే స్పష్టం చేస్తుంటారు. కాబట్టి సోనియా గాంధీని ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర సీఎం హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వేడుకలకు రావాల్సిందిగా కోరుతూ సోనియా గాంధీని ఆహ్వానించారు.
వేడుకలకు సోనియా గాంధీ రావడానికి అంగీకరించారు. దీనితో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. వేడుకలను భారీ ఎత్తున నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి తెలంగాణ ఉద్యమ కారున్ని ఈ వేడుకలకు పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు భాద్యత మాజీ ప్రొఫెసర్ కోదండరాం కు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియా గాంధీని ఘనంగా సన్మానించనున్నారు. ఆమెతో పాటు తెలంగాణ ఉద్యమ కారులను కూడా సన్మానించనున్నారు.