KTR coments : వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సి ఎన్నిక ప్రచారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు. బీజేపీ నుంచి వచ్చి బిఆర్ఎస్ కండువా కప్పుకున్న రాకేష్ రెడ్డి ని అభ్యర్థిగా బరిలో నిలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కంకణం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా తన అభ్యర్థి రాకేష్ రెడ్డిని విపరీతంగా పొగుడుతున్నారు. రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గోల్డ్ మెడల్ సాధించారు. అంతవరకు బాగానే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను ఉద్దేశించి మాట్లాడిన మాటలే సరిగా లేవని పలుఫురు పట్టభద్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
బిట్స్ పిలానీ మా వైపు ఉంటె , పల్లి బఠాణి మీ వైపు ఉందని వ్యాఖ్యానించడం పై పట్టభద్రుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బిట్స్ పిలానీలో చదివిన మీ నాయకుడు రాకేష్ రెడ్డి కావచ్చు. కానీ ఇప్పటి నుంచి వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా బిట్స్ పిలానీ లో చదివిన వారినే మీ పార్టీ తరపున అభ్యర్థులుగా పోటీలో నిలపాలంటున్నారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో బిట్స్ పిలానీ సంస్థలను జిల్లాకొకటి ఎందుకు స్థాపించలేదని కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు.
సాధారణ కళాశాలల్లో డిగ్రీ చదివిన వారు రాజకీయాలకు పనికిరారా అనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి నుంచే బిట్స్ పిలానీలో చదివిన వారి కోసం వెతుకులాడుకోవాల్సిందిగా పలువురు పట్టభద్రులు కోరుతున్నారు. బిట్స్ పిలానీ చదివిన వారే అంత ఇష్టం కావడంతోనే, మీ పార్టీ అధినేత కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ను అమలుచేయలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీ పదేళ్ల పరిపాలనలో పని చేసిన అధికారులు అంత కూడ బిట్స్ పిలానీలో చదివి తెలంగాణ ప్రభుత్వం లో నియామక ఐనారా అంటూ పలువురు పట్టభద్రలు ప్రశ్నిస్తున్నారు.